Wednesday, April 24, 2024

జంతర్ మంతర్‌కు వెళ్లి వారి ‘మన్‌కీ బాత్’ వినండి!

- Advertisement -
- Advertisement -
ప్రధాని మోడీకి కపిల్ సిబల్ సూచన

న్యూఢిల్లీ: జంతర్ మంతర్‌కు వెళ్లి నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్ల ‘మన్‌కీ బాత్’ వినమని ప్రధాని నరేంద్ర మోడీకి రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ సోమవారం కోరారు. వారి బాధ ఏమిటో అలా చేస్తే అర్థం అవుతుందన్నారు. సీనియర్ అడ్వొకేట్ అయిన సిబల్ సుప్రీంకోర్టులో రెజ్లర్ల కేసును వాదించారు కూడా. ప్రధాని నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం నూరో మన్‌కీ బాత్ తరువాతి రోజున ఈ వ్యాఖ్యలు చేశారు.

కపిల్ సిబల్ తన ట్వీట్‌లో ‘100వ మన్‌కీ బాత్ సందర్భంగా శుభాకాంక్షలు మోడీజీ, మీకు సమయం ఉంటే జంతర్ మంతర్ వెళ్లి నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్ల ‘మన్‌కీ బాత్’ వినండి’ అన్నారు. అప్పుడైనా వారి బాధేమిటో అర్థం కాగలదన్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా శుక్రవారం ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. బిజెపి ఎంపీ అయిన ఆయనపై ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు దాఖలు చేశారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కేసును నమోదు చేయాలని ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్, న్యాయమూర్తి పిఎస్. నరసింహతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఢిల్లీ పోలీసులకు ప్రాతినిధ్యం వహించిన సాటిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. కాగా కొన్ని గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. రెండు ఎఫ్‌ఐఆర్‌లలో ఒకటి పోక్సో చట్టం కింద, రెండోది మహిళల గౌరవానికి సంబంధించింది. ఇదిలావుండగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అరెస్టయ్యేంత వరకు తాము జంతర్ మంతర్ నుంచి కదలబోమని రెజ్లర్లు నిక్కచ్చిగా తెలిపారు. వారు వారం రోజులుగా ప్యానెల్ దర్యాప్తు వివరాలు వెల్లడించాలని నిరసన తెలుపుతున్నారు.

Wrestlers-protest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News