Saturday, July 27, 2024

గోదావరి జలాలు తరలిస్తే ఉత్తర తెలంగాణ పరిస్థితి ఏంటి?: వినోద్ కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నదుల అనుసంధానానికి కేంద్రం కసరత్తు చేస్తోందని కరీంనగర్ బిఆర్‌ఎస్ అభ్యర్థి బోయిన్ పల్లి వినోద్ కుమార్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నదుల అనుసంధానంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని, సమ్మక్క-సారక్క సీతారామ ప్రాజెక్టులకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకు అనుమతి తరువాతే అనుసంధానంపై ఆలోచన చేయాలని, తెలంగాణకు వచ్చే జలాలను కొల్లగొట్టేలా కేంద్రం, రాష్ట్రం చర్యలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. గోదావరి జలాలు తరలిస్తే ఉత్తర తెలంగాణ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎవరూ పట్టించుకోరనే ఎంవొయు ఇచ్చారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News