Thursday, January 23, 2025

గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు సోమవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

వాహనసేవల్లో తిరుమల పెద్ద జీయ‌ర్‌స్వామి,  చిన్న జీయ‌ర్‌స్వామి, టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఇఒ జె శ్యామలరావు, అదనపు ఇఒ వెంకయ్య చౌదరి, చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నాని, బోర్డు సభ్యులు సుచిత్ర, జెఇఒ వీరబ్రహ్మం, సివిఎస్ఒ శ్రీధర్, ఆలయ డీప్యూటీ ఇఒ గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News