Friday, May 3, 2024

అత్యవసర పరిస్థితుల్లో గోల్డ్ లోన్ బెటర్

- Advertisement -
- Advertisement -

రుణానికి వేగవంతమైన, సులభమైన ప్రక్రియ
ఇతర రుణాల కంటే వడ్డీ రేటు కూడా తక్కువ

న్యూఢిల్లీ : వ్యక్తుల తమ అవసరాల కోసం బ్యాంకు రుణాలు, ఇతర మాద్యమాలపై ఎక్కువగా ఆధారపడతారు. అత్యవసర పరిస్థితుల్లో రుణం కోసం చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. తెలిసిన వారినో లేదా బ్యాంకులు, బంగారం రుణం సంస్థలను ఆశ్రయించాల్సి వస్తుంది. అయితే బంగారం ద్వారా ఇచ్చే రుణాలకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. ఇది ఉత్తమమైనది, అదే సమయంలో ఎంతో సులభతరమైనది. ఆర్థిక ఒత్తిడి, సంక్షోభ సమయాల్లో అకస్మాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు ఇంట్లో ఉన్న బంగారం మీకు మంచి రుణం ఎంపిక అవుతుంది. దేశంలోని వివిధ బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు బంగారంపై రుణాలు ఇస్తున్నాయి. అయితే ఎంత రుణం పొందవచ్చు అనేది, మీ బంగారం నాణ్యత, అలాగే రుణం ఇచ్చే బ్యాంకు, ఎన్‌బిఎఫ్‌సి పాలసీపై ఆధారపడి ఉంటుంది.

గోల్డ్ లోన్‌కు ప్రమాణాలు
బంగారం రుణం తీసుకోవాలనుకునే వ్యక్తి వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 75 సంవత్సరాలు ఉండాలి. రుణదాతకు తాకట్టు లేదా హామీగా ఇవ్వడానికి మీరు తప్పనిసరిగా బంగారం లేదా ఆభరణాలను కలిగి ఉండాలి. తాకట్టుగా ఉంచిన బంగారం స్వచ్ఛత 18 క్యారెట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.

గోల్డ్ లోన్ తీసుకోవడం ఎలా?
సులభమైన ప్రమాణాలు: గోల్డ్ లోన్ కోసం ప్రమాణాలు ఇతర రుణాల కంటే చాలా సులభతరంగా ఉంటాయి. ఇక్కడ మీ క్రెడిట్ స్కోర్ లేదా ఇతర హామీలు పెద్దగా పట్టించుకోవు. మీ బంగారం నాణ్యత, విలువ ఆధారంగా రుణం లభిస్తుంది.

తక్కువ సమయంలో రుణం: అత్యవసర సమయాల్లో మీకు వెంటనే డబ్బు అవసరమైనప్పుడు తక్షణమే రుణం పొందడం కష్టమైన విషయం, కానీ బంగారం రుణం విషయంలో మాత్రం ఇది పూర్తిగా భిన్నమైంది. తక్షణమే రుణం పొందే వెసులుబాటు ఉంటుంది.

పోటీ వడ్డీ రేట్లు: సంక్షోభ సమయాల్లో వ్యక్తిగత రుణాలు, ఆస్తి రుణాలు, కార్పొరేట్ రుణాలు వంటి ఇతర రుణాలతో పోలిస్తే తక్కువ వడ్డీ రేట్లకు బంగారు రుణాలు సులభంగా లభిస్తాయి. అందుకే వీటికి డిమాండ్ పెరుగుతోంది.

ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్స్: గోల్డ్ లోన్ విషయంలో రుణగ్రహీతకు రుణాన్ని తిరిగి చెల్లించడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. ఉదాహరణకు మీకు కావాలంటే మీరు ప్రతి నెలా వడ్డీని మాత్రమే డిపాజిట్ చేయవచ్చు. ఇతర ఎంపికలు చాలా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News