Friday, May 16, 2025

10% తగ్గిన పసిడి ధర

- Advertisement -
- Advertisement -

బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల పసిడి ధర (24 క్యారెట్) ధర రూ.2,130 తగ్గి రూ.94,080 కు చేరుకుంది. అలాగే హైదరాబాద్‌లో కూడా 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్) 2,130 తగ్గి రూ.93,930 కు దిగొచ్చింది. ఇక గురువారం ఎంసిఎక్స్‌లో గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ గరిష్ఠ స్థాయి రూ.99,358 నుంచి దాదాపు రూ.7,900 తగ్గింది. దీంతో ఇంట్రాడేలో పసిడి ధర 10 గ్రాములు రూ.91,461గా ఉంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి వల్ల బంగారంపై ప్రభావం పడింది. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తమ లాంగ్ పొజిషన్లు క్లోజ్ చేసుకుంటున్నారు. సిల్వర్ ఫ్యూచర్స్ కిలోగ్రామ్ ధర రూ.95,466 కు ముగిసింది.

ఈ వెండి 1.34 శాతం క్షీణంచింది. అంతర్జాతీయ మార్కెట్లో ఏప్రిల్‌లో ఔన్స్ పసిడి ధర 3500 డాలర్లకు చేరింది. తాజాగా ఇది 10 శాతం తగ్గి 3150 డాలర్లకు దిగొచ్చింది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,494 తగ్గి రూ.92,365కి చేరుకుంది. అదే సమయంలో వెండి ధర కూడా రూ.1,828 తగ్గి రూ.94572కి చేరుకుంది. ఏప్రిల్‌లో బంగారం ధర రూ.1 లక్ష దాటి ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరింది. కానీ ఇప్పుడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి ధరలు దిగొస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News