Friday, March 1, 2024

రూ.63 వేలకు చేరువలో బంగారం ధర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బంగారం ఆల్ టైమ్ హైకి చేరుకుంది. అంతర్జాతీయ బంగారం రేట్ల ప్రభావంతో పసిడి రేట్లలో పెరుగుదల కనిపిస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.62,560 వద్ద ఉంది. అయితే సోమవారం పసిడి ధర గణనీయంగా పెరగ్గా, మంగళవారం తటస్థంగానే ఉంది. స్థానికంగా 10 గ్రాముల బంగారం ధర రూ.63 వేలకు చేరువ అవుతోంది. స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న ఒడిదుడుకుల కారణంగా బంగారానికి మద్దతు లభిస్తోందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనూజ్ గుప్తా తెలిపారు. దీని వల్ల వచ్చే ఏడాదిలో ఈ బంగారం 10 గ్రాములకు రూ.67 వేలకు చేరుకోనుందని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News