Tuesday, April 23, 2024

బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను రాజేంద్రనగర్ ఎస్‌ఓటి, కస్టమ్స్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 700 గ్రాములు బంగారు బిస్కెట్లు, 13పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.40లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని ఫలక్‌నూమాకు చెందిన సయిద్ మోయిజ్ పాషా, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లికి చెందిన సమీర్ ఖాన్, రేయిన్‌బజార్‌కు చెందిన ఎండి అర్షద్ వ్యాపారం చేస్తున్నారు. సయిద్ మోయిజ్ ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.

నిందితుడు పలువురు అమాయకులను టూరిస్ట్ వీసా పై దుబాయ్‌కి పంపించి వారి ద్వారా నగరానికి బంగారం తెప్పిస్తున్నాడు. దుబాయ్ నుంచి తెప్పించిన బంగారాన్ని మైలార్‌ దేవ్‌పల్లిలో స్థానికులకు విక్రయించేందుకు యత్నిస్తుండగా కస్టమ్స్ అధికారులు,రాజేంద్రనగర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. సయిద్ గత నెల రెండో వారంలో సమీర్‌ఖాన్ అనే వ్యక్తిని దుబాయ్‌కు పంపించాడు. అతడి ద్వారా గత నెల 28న తెల్లవారుజామున ఆరు బంగారు బిస్కెట్లను తెలిప్పించాడు. వాటిని స్థానికంగా విక్రయించేందుకు యత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రవి, హెచ్‌సి సిరాజుద్దిన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News