Wednesday, April 24, 2024

దేశం మిమల్ని చూసి గర్విస్తుంది : మెగాస్టార్ చిరంజీవి

- Advertisement -
- Advertisement -

 

గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అనేది హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ద్వారా 1944 సంవత్సరం అమెరికాలో ప్రారంభమైన అవార్డులు ఇవి అమెరికన్, అలాగే అంతర్జాతీయంగా సినిమా, టెలివిజన్ రెండింటిలోనూ శ్రేష్ఠతను గుర్తించి అందిస్తారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌-2023లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌(2022)కి రెండు నామినేషన్లు దక్కాయి. ఉత్తమ ఆంగ్లేతర చిత్రం విభాగంలోనూ, ఎం. ఎం. కీరవాణి స్వరపరిచిన నాటు నాటు… పాటకి ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలోనూ ఈ చిత్రం నామినేట్‌ అయ్యి  గ్లోబెన్‌ గోల్డ్‌ అవార్డు గెలుచుకోవడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.

మిమ్మల్ని చూసి దేశం గర్విస్తుందని సోషల్‌ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. ఇదొక అద్భుతమైన,చారిత్రక విజయమని, ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ పాటకి కీరవాణి గోల్డెన్‌ గ్లోబ్‌ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు నా అభినందనలు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తుంది, సంగీతం, డ్యాన్స్‌.. ఈ రెండింటి సెలబ్రెషనే మన దేశమే కాదు ప్రపంచం మొత్తం ఈ రోజు మీతో కలిసి డ్యాన్స్‌ చేస్తుందని, చరణ్‌, తారక్‌తో పాటు అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్‌, ఉర్రూతలూగించేలా ఆలిపించిన రాహుల్‌, కాలభైరవ, కొరియాగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌కు కంగ్రాంట్స్‌ అంటూ ట్విట్టర్‌ వేదికగా టీమ్‌ మొత్తానికి అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News