Thursday, July 18, 2024

హైదరాబాద్ మెట్రో రైల్‌కు గోల్డెన్ పికాక్ పురస్కారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో మెట్రో రైలును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటించడంలో గల నిబద్ధతకు రైల్వేస్ విభాగంలో గోల్డెన్ పికాక్ పురస్కారాన్ని అందుకుంది. బెంగళూరులో జరిగిన ప్రతిష్టాత్మక ’ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ 25వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్’ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

మొత్తం 778 దరఖాస్తులు రాగా, తీవ్రమైన పోటీలో విజేతగా నెగ్గిన ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ, భద్రతా ప్రమాణాల పాటింపులో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుందని కేబీవీ రెడ్డి తెలిపారు. ఉద్యోగుల భద్రత, సంక్షేమం విషయంలో కృషికి గానూ ఈ పురస్కారం నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ఈ పురస్కారం తమకెంతో స్ఫూర్తినిస్తూ, నిరంతరం కృషి చేసేలా ప్రోత్సాహకరంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News