శ్రీనగర్: భారత్-పాక్ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. పాక్ (Ind vs Pak) యథేచ్ఛగా కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తోంది. సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల వర్షం కురుపిస్తోంది. భారత భద్రత బలగాలను పాక్ డ్రోన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాయి. జమ్ము కశ్మీర్‌లో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో అదనపు డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాపతో మరో ఐదుగురు మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. రాజ్ కుమారి నివసిస్తున్న ఇంటి(క్వార్టర్)పై షెల్ పడడంతో కన్నుమూశాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అధికారి మృతిపట్ల సిఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. శ్రీనగర్ నుంచి ప్రారంభిస్తే గుజరాత్ వరకు పాక్ దాడులకు పాల్పడుతోంది. పఠాన్‌కోట్‌లో పేలుళ్ల శబ్దాలు మారుమోగుతుండడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. శనివారం ఉదయం ఐదు గంటల నుంచే భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. పాక్ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది.
సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్… అదనపు డిప్యూటీ కమిషనర్ తో పాటు ఐదుగురు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -