Thursday, April 25, 2024

ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తిన సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -
Sonia Gandhi address in Chintan Shivir
చింతన్ శివిర్: సెషన్‌ను ఉద్దేశించి సోనియా గాంధీ మాట్లాడుతూ, ‘గరిష్ట పాలన, కనీస ప్రభుత్వం’ అంటే ప్రధాని మోడీ, అతని సహచరులు ఏమిటో స్పష్టంగా అర్థమైందని అన్నారు. “దీని అర్థం మైనారిటీలపై  క్రూరత్వాన్ని ప్రదర్శించడమే” అని ఆమె పేర్కొన్నారు. 

ఉదయ్ పూర్: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం రాజస్థాన్ లో నిర్వహించిన  ‘చింతన్ శివిర్’ లో  ప్రసంగాన్ని ప్రారంభించి కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి  ప్రభుత్వం మైనార్టీలను క్రూరంగా హింసిస్తోందని, మహాత్మాగాంధీ హంతకులను కీర్తిస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. “బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థల విధానాల ఫలితంగా దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను  చర్చించడానికి, అర్థవంతమైన ఆత్మపరిశీలన చేసుకోవడానికి మేధోమథన సెషన్ కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చింది’ అన్నారు.

ఉదయ్‌పూర్‌లో ‘నవ్ సంకల్ప్ చింతన్ శివిర్’ పేరుతో జరిగిన మూడు రోజుల సెషన్‌ను ఉద్దేశించి, సోనియా గాంధీ మాట్లాడుతూ, ‘‘గరిష్ట పాలన, కనీస ప్రభుత్వం’ అనే నినాదంతో ప్రధానమంత్రి ,  ఆయన సహచరులు నిజంగా చేస్తున్నదేమిటో  చాలా స్పష్టంగా, ‘బాధాకరంగా’ ఉంది”  అన్నారు. నిజానికి వారు దేశాన్ని విభజించి పాలిస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News