Thursday, February 22, 2024

ఆస్పత్రిలో వధువును పెళ్లి చేసుకున్న వరుడు

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఆస్పత్రిలో యువతిని యువకుడు పెళ్లి చేసుకున్న సంఘటన రాజస్థాన్ రాష్ట్రం కోటా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భావ్‌పూర్ గ్రామానికి చెందిన పంకజ్‌కు రావత్‌భటా గ్రామానికి చెందిన మధు రాఠోడ్‌తో పెళ్లి నిశ్చయం కావడంతో అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. పెళ్లి జరిగే రోజు వధువు జారిపడడంతో రెండు చేతులు విరిగిపోయాయి. ఆమె తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో పెళ్లి కుమారుడు ఊరేగింపుగా తన పెళ్లి మండపానికి చేరుకుంటుండగా ఈ వార్త తెలిసింది. వెంటనే ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆస్పత్రిలో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక రూమ్ తీసుకొని ముస్తాబు చేశారు. అక్కడే వేదమంత్రాల సాక్షిగా వరుడు వధువు మెడలో మూడు ముళ్లు వేసి ఒక్కటయ్యారు. ఈ జంటను ఆస్పత్రి సిబ్బందితో పాటు బంధువులు దివించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News