Thursday, April 25, 2024

జులై 1న గ్రూప్ 4 పరీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి గ్రూప్-4 పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జులై 1వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్టు కమిషన్ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2.30 గంల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్- 2 పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లోని 25 విభాగాల్లో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి 2022 డిసెంబర్‌లో టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
8,180 పోస్టులకు 9,08,061 దరఖాస్తులు
రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. 8,180 పోస్టులకు గురువారం సాయంత్రం వరకు 9,08,061 మంది దరఖాస్తు చేసుకున్నట్లు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది. బుధవారం 15,844 మంది దరఖాస్తు చేసుకోగా.. శుక్రవారం కొత్తగా మరో 12,029 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు శుక్రవారంతో గడువు ముగియనుండటంతో అభ్యర్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు భారీ స్పందన వస్తుండటంతో సర్వర్‌పై ఒత్తిడి అనూహ్యంగా పెరిగి దరఖాస్తు ఫారం పూర్తి చేశాక ఫీజు చెల్లింపులో అభ్యర్థులకు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దాంతో కమిషన్ దరఖాస్తు గడువును పొడిగించింది. తొలుత జనవరి 30తో దరఖాస్తులకు గడువు ముగియడంతో విద్యార్థుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని దరఖాస్తు గడువును శుక్రవారం(ఫిబ్రవరి 3)వరకు పొడిగిస్తూ ఇటీవల టీఎస్పీఎస్సీ నిర్ణయం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News