Friday, April 26, 2024

త్వరలో జిఎస్‌టి పరిహారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జిఎస్‌టి కౌన్సిల్, అపెక్స్ డెసిషన్ మేకింగ్ అథారిటీ శనివారం పెన్సిల్ షార్పనర్‌లతో సహా పలు వస్తువులపై పన్నురేటు తగ్గించింది. వార్షిక దాఖలు ఆలస్య రుసుమును సవరణ చేస్తున్నట్లు కౌన్సిల్ తెలిపింది. జిఎస్‌టి కౌన్సిల్ 49వ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ పాన్‌మసాలా, గుట్కా పరిశ్రమల్లో పన్ను ఎగవేతలను తనిఖీచేయడంతోపాటు వస్తు, సేవల పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్స్ (జిఎస్‌టిఎటి)పై, మంత్రుల బృందం నివేదికలు అందజేసినట్లు తెలిపారు. జూ న్ 2022కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 16,982కోట్ల జిఎస్‌టి పరిహారాన్ని క్లియ ర్ చేయాలని కేంద్రం నిర్ణయించిందని సీతారామ న్ ప్రకటించారు. కేంద్రం తన సొంత ఆర్థిక వనరుల ఈ మొత్తాన్ని విడుదల చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. భవిష్యత్తు లో పరిహారాన్ని సెస్ సేకరణ నుంచి తిరిగి పొందనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి తెలిపారు. జిఎస్‌టి నష్టపరిహారం) చట్టం 2017 ప్రకారం ఐదేళ్లపాటు తాత్కాలికంగా అనుమతించిన మొ త్తం పరిహారం బకాయిలను కేంద్రం చెల్లిస్తుందని ప్రకటించారు.

అకౌంటెంట్ జనరల్ ధ్రువీకరించిన రాష్ట్రాలకు రూ.16,524కోట్ల జిఎస్‌టి పరిహారాన్ని కేంద్రం క్లియర్ చేస్తుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రబ్ (ద్రవపూరిత బెల్లం)పై ఉన్న జిఎస్‌టి రేటును పూర్తిగా తగ్గించాలని ప్యానెల్ సిఫార్సు చేసిందన్నారు. ఒకవేళ విడిగా అమితే 5శాతం లేదా ప్యా క్ చేసి లేబుల్ ఉంటే 5శాతానికి తగ్గించనున్నట్లు ఆమె తెలిపారు. పెన్సిల్ షార్పనర్లపై ప్రస్తుతం 18 శాతం సుంకాన్ని 12శాతానికి తగ్గించారు. ట్యాగ ట్రాకింగ్ పరికరం లేదా డేటా లాగర్ వంటి పరికరం అతికించి ఉంటే ఆ పరికరంపై ఐజిఎస్‌టి విధించరని వెల్లడించారు. బొగ్గు వాషరీ (పారిశ్రామిక వినియోగానికి సంబంధించి మలినాలను తొలగించడం ద్వారా మండే పదార్థాలను పెంపొందించే ప్రక్రియ), సరఫరాను తిరస్కరించే బొగ్గుపై మినహాయింపు ప్రయోజనాలను పొడిగించినట్లు తెలిపారు. 202223 నుంచి జిఎస్‌టిఆర్ 9లో వార్షిక రిటర్నులను ఆలస్యంగా దాఖలు చేయడానికి రుసుమును సవరించాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది.

ఆర్థిక సంవత్సరంలో రూ.20కోట్ల టర్నోవర్ కలిగినవారికి ఇది వర్తిస్తుందన్నారు. కాగా ఆర్థిక సంవత్సరంలో రూ.5కోట్ల వరకు టర్నోవరు కలిగి ఉన్న వ్యక్తులకు ఆలస్య రుసుము రోజుకు రూ.50ఉంటుంది. గరిష్ఠంగా టర్నోవరులో 0.004శాతం ఉంటుంది. రూ.5కోట్ల కంటే ఎక్కువ, రూ.20కోట్ల వరకు ఉన్నట్లయితే టర్నోవరులో 0.04శాతానికి లోబడి రోజుకు రూ.100జరిమానా విధిస్తారు. ప్రస్తుతం వార్షిక రిటర్న్ దాఖలు చేయడంలో ఆలస్యం అయితే టర్నోవరులో 0.5శాతానికి రోజుకు రూ.200 ఆలస్య రుసుమును చెల్లించేవారు. అధిక సంఖ్యలో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి జిఎస్‌టిఆర్ 4, జిఎస్‌టిఆర్ 9, జిఎస్‌టిఆర్ 10లో పెండింగ్‌లో ఉన్న రిటర్నులకు సంబంధించి షరతులతో కూడిన మినహాయింపులను సిఫార్సు చేసింది.

జిఎస్‌టి అప్పిలేట్ ట్రిబ్యునల్‌పై మంత్రుల బృందం ఇచ్చిన నివేదికను కొన్ని మార్పులతో కౌన్సిల్ ఆమోదించిందని సీతారామన్ తెలిపారు. పాన్‌మసాలా, గుట్కా, నమిలే పొగాకు ఉత్పత్తులు నుంచి ఆదాయ సేకరణను మెరుగుపరచాలని సిఫార్సులను కౌన్సిల్ ఆమోదించింది. పాన్ మసాలా, గుట్కా పరిశ్రమల్లో పన్ను ఎగవేతలను తనిఖీ చేసే మంత్రుల బృందం ఒడిశా మంత్రి నిరంజన్ పూజారి నేతృత్వం వహించనున్నారు. హర్యానా డిప్యూటీ సిఎం చౌతాలా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్పిటేల్ ట్రిబ్యునల్స్ (జిఎస్‌టిఎటిఎస్) ప్యానెల్‌కు నాయకత్వం వహిస్తారని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాగా కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలోని జిఎస్‌టి కౌన్సిల్‌లో రాష్ట్రాలు, యుటిల (శాసనసభ) ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News