Sunday, May 18, 2025

ఢిల్లీకి సవాల్

- Advertisement -
- Advertisement -

నేడు గుజరాత్‌తో ఢీ
న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే పోరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు(GT vs DC) సవాల్‌గా మారింది. నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితి ఢిల్లీకి నెలకొంది. ఇక గుజరాత్ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్ బెర్త్ సొంతమవుతోంది. ఢిల్లీకి మాత్రం ఇది చావోరేవో లాంటి పోరు అనే చెప్పాలి.

కచ్చితంగా గెలవాల్సిన అవసరం జట్టుకు ఉంది. ఆరంభంలో బాగానే ఆడిన ఢిల్లీ ఆ తర్వాత గాడి తప్పింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో కిందికి పడిపోయింది. ప్రస్తుతం ప్లేఆఫ్ (GT vs DC) అవకాశాలను కూడా సంక్లిష్టంగా మార్చుకుంది. పటిష్టమైన గుజరాత్‌పైవిజయం సాధించాలంటే ఢిల్లీ సర్వం పోరాడక తప్పదు. డుప్లెసిస్, కరుణ్ నాయర్, అభిషేక్ పొరెల్, కెఎల్ రాహుల్, కెప్టెన్ అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్ తదితరులు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. ముస్తఫిజుర్ రహ్మాన్ చేరడంతో బౌలింగ్ కాస్తా పటిష్టంగా మారింది. ఈ మ్యాచ్‌లో జట్టు ఆశలన్నీ అభిషేక్ పొరెల్, నాయర్, రాహుల్‌పైనే నిలిచాయి. వీరు తమ తమ బ్యాట్‌లకు పని చెప్పక తప్పదు. డుప్లెసిస్, స్టబ్స్ కూడా కీలకంగా మారారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు.

అయితే సమష్టిగా రాణించడంలో ఢిల్లీ విఫలమవుతోంది. కనీసం రెండో దశ మ్యాచుల్లోనైనా ఆటగాళ్లు సమష్టిగా రాణించాల్సి ఉంది. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇక గుజరాత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సదుర్శన్‌లు జోరుమీదున్నారు. జోస్ బట్లర్ కూడా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. రూథర్‌ఫోర్ట్ కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతున్నాడు. సిరాజ్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, ప్రసిద్ధ్ కృష్ణ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. రెండు విభాగాల్లో సమతూకంగా ఉన్న గుజరాత్‌కే ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తునాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News