Wednesday, May 1, 2024

ప్రొ కబడ్డీ లీగ్‌: తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో తెలుగు టైటాన్స్‌ ఢీ

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మకమైన ప్రొ కబడ్డీ లీగ్‌కు శనివారం తెరలేవనుంది. డిసెంబర్ 2న ప్రారంభమయ్యే లీగ్ దశ పోటీలు ఫిబ్రవరి 21న ముగుస్తాయి. నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ఖరారు చేస్తారు. అహ్మదాబాద్‌లోని ట్రాన్స్‌స్టాడియా స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌తెలుగు టైటాన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ ప్రారంభమవుతోంది. ఈ లీగ్‌లో మొత్తం 12 జట్లు పోటీ పడనున్నాయి. బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, డబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్, పుణెరి పల్టన్, పాట్నా పియరేట్స్, తమిళ్ తలైవాస్,

తెలుగు టైటాన్స్, యూ ముంబా, యూపి యోధా జట్లు తలపడుతాయి. ప్రతి జట్టు తమ సొంత మైదానంతో పాటు ప్రత్యర్థి వేదికల్లో లీగ్ మ్యాచ్‌లు ఆడుతోంది. రెండు నెలలకు పైగా ఈ టోర్నీ కొనసాగుతుంది. అహ్మదాబాద్, బెంగళూరు, పుణె, చెన్నై, నోయిడా, ముంబై, జైపూర్, హైదరాబాద్, పాట్నా, ఢిల్లీ, కోల్‌కతా,పంచకులా నగరాల్లో లీగ్ దశ పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పోటీ పడనున్నాయి. కాగా, హైదరాబాద్‌లో జనవరి 19 నుంచి 25 వరకు ప్రొ కబడ్డీ లీగ్ జరుగుతుంది. శుక్రవారం అహ్మదాబాద్‌లో ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 12 జట్లకు సంబంధించిన కెప్టెన్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News