Monday, May 19, 2025

ఐపిఎల్ 2025లో చరిత్ర సృష్టించిన గుజరాత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2025లో గుజరాత్ జట్టు చరిత్ర సృష్టించింది. వికెట్ నష్టపోకుండా అత్యధిక స్కోరును ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. నిన్న రాత్రి ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ ఈ రికార్డు సాధించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అత్యధిక స్కోరు(200)ను ఛేదించి షాకిచ్చింది. ఐపిఎల్ చరిత్రలో ఇప్పటివరకు మరే ఇతర జట్టు కూడా ఇలాంటి ఘనతను సాధించలేదు.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 112 అజేయ శతకంతో చెలరేగాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ జట్టు బ్యాటింగ్‌తో అసాధారణ ప్రదర్శన చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ 61 బంతుల్లో 108 పరుగులతో అజేయ శతకంతో విజృంభించగా.. కెప్టెన్ గిల్ 53 బంతుల్లో అజేయంగా 93 పరుగులు సాధించారు. వీరి అసాధారణ ఇన్నింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ జట్టును కేవలం 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో గుజరాత్ జట్టు ప్లేఆఫ్ కు చేరుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News