Wednesday, May 7, 2025

క్యాచ్‌లు చేజార్చుకున్న గుజరాత్.. స్కోర్ ఎంతంటే..

- Advertisement -
- Advertisement -

ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా.. ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్‌లో అశ్రద్ధ కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్‌కి శుభారంభం లభించింది. తొలి ఓవర్‌లోనే రికెల్‌టన్ ఔట్ కాగా విల్‌జాక్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. వచ్చిన రెండో బంతికే అతను క్యాచ్ ఇవ్వగా.. సాయి సుదర్శన్ దాన్ని డ్రాప్ చేశాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్‌లోనే రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. అయితే క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ పది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రశిద్ధ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చాడు.

ఈ క్యాచ్‌ని సాయి కిశోర్ వదిలేశాడు. మరోసారి ఆరో ఓవర్‌లో అర్షద్ బౌలింగ్‌లో విల్‌జాక్స్ క్యాచ్ ఇవ్వగా.. సిరాజ్ ఆ బంతిని చేజార్చుకున్నాడు. ఫలితంగా 29 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేశాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్ వేసిన 12వ ఓవర్ నాలుగో బంతికి జాక్స్(53) సాయి సుదర్శన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి ముంబై 5 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. క్రీజ్‌లో తిలక్ వర్మ(6), నమన్ ధీర్(1) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News