Wednesday, May 7, 2025

గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 156

- Advertisement -
- Advertisement -

వాంఖడే స్టేడియం వేదికగా.. ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది.టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్‌కి శుభారంభం లభించింది. తొలి ఓవర్‌లోనే రికెల్‌టన్ ఔట్ కాగా విల్‌జాక్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. వచ్చిన రెండో బంతికే అతను క్యాచ్ ఇవ్వగా.. సాయి సుదర్శన్ దాన్ని డ్రాప్ చేశాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్‌లోనే రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. విల్ జాక్స్(53;35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్) అర్థ శతకం బాదగా.. సూర్యకుమార్ యాదవ్ (35; 24 బంతుల్లో 5 ఫోర్లు) రాఫించాడు. కోర్బిన్ బాష్ 27 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ 2, రషీద్ ఖాన్, సిరాజ్ , అర్షద్ ఖాన్,ప్రసిద్ధ్ క్రిష్ణ, గెరాల్డ్ కొయెట్టి తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News