- Advertisement -
సాయి సుదర్శన్(108), శుభ్‌మన్ గిల్(93) వీరవిహారం చేయడంతో గుజరాత్ టైటాన్స్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ తో చెలరేగిన గుజరాత్.. అనంతరం లక్ష ఛేదనలోనూ అదేతీరుతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్ధేశించిన 200 పరుగుల లక్షాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 9 మ్యాచ్‌లలో విజయం సాధించి 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బ్యాటర్లలో కెఎల్ రాహుల్(112) శతకంతో చెలరేగగా.. అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25) రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది ఢిల్లీ.
- Advertisement -