- Advertisement -
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకి కీలకం కానుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో ముంబై మూడో స్థానంలో, గుజరాత్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి జట్టు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతోంది. మరోవైపు గుజరాత్ జట్టులో ఒక మార్పు చేసింది. సుందర్ స్థానంలో అర్షద్‌ని జట్టులోకి తీసుకుంది.
- Advertisement -