Friday, April 19, 2024

కెనడా సరిహద్దుల్లో మరణించిన గుజరాతీ కుటుంబం గుర్తింపు

- Advertisement -
- Advertisement -

Gujarati family found dead on US-Canada border

టోరంటో: కెనడా/అమెరికా సరిహద్దు సమీపంలోని మానిటోబాలో ఈ నెల 19న మంచుతుపానులో చిక్కుకుని సజీవసమాధి అయిన నలుగురు సభ్యులతో కూడిన ఒక భారతీయ కుటుంబ ఆచూకీని కెనడా ప్రభుత్వం నిర్ధారించినట్లు ఇక్కడి భారతీయ హైకమిషన్ తెలిపింది. మంచుతుపానులో కూరుకుపోయి మరణించిన నలుగురు వ్యక్తులను జగదీష్ బైదేవ్‌భాయ్ పటేల్(-పురుషుడు–39-), వైశాలిబెన్ జగదీశ్‌కుమార్ పటేల్(స్త్రీ-37), విహంగి జగదీశ్‌కుమార్ పటేల్(పాప11), ధార్మిక్ జగదీష్‌కుమార్ పటేల్(బాబు-3)గా గుర్తించినట్లు భారత హైకమిషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపిది. గుజరాత్‌కు చెందిన ఈ కుటుంబానికి చెందిన బంధువులకు సమాచారాన్ని అందచేసినట్లు హైకమిషన్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News