మేషం – దూరప్రాంత వ్యవహారాలు ఫలిస్తాయి. రావలసిన ధనం చేతికంది వస్తుంది. అయితే అంతకుమించిన చెల్లింపులను మీరు చెల్లించవలసి రావడం కష్టతరంగా పరిణమిస్తుంది.
వృషభం – మానసిక సంఘర్షణకు గురవుతారు. సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యతను ఇచ్చి లాభపడతారు. స్నేహితుల సహాయ సహకారాలను అందుకుంటారు. మారుతున్న సామాజిక పరిస్థితులు ఆలోచింపచేస్తాయి.
మిథునం – పొదుపు పథకాలను పాటించడంలో వైఫల్యాన్ని చెందుతారు. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయి.
కర్కాటకం – చాలా సందర్భాలలో మీ అంచనాలు తారుమారు అవుతాయి. పెట్టుబడులు, కీలకమైన చర్చలు, ముఖ్యమైన ప్రయాణాలలో నిదానంగా వ్యవహరించండి. సత్ఫలితాలు పొందగలుగుతారు.
సింహం – ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఏ పని ఎందుకు చేస్తున్నారో మీకు తప్ప ఇతరులకు తెలియనివ్వరు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి.
కన్య – కొత్త రంగాలలో అనుభవం సాధించడానికి గాను శ్రీకారం చుడతారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్య చర్చలను సాగిస్తారు.
తుల – పలువురు ప్రశంసించే విధంగా మీ నడవడిక ఉంటుంది. కుటుంబ బరువు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారు.పెట్టుబడికి కావలసిన ధనాన్ని ధైర్యం చేసి అప్పు చేస్తారు.
వృశ్చికం – రహస్యంగా చర్చలను సాగిస్తారు.కర్త, కర్మ, క్రియ అన్ని మీరే అయ్యి సంస్థను ముందుకు నడిపిస్తారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారు.
ధనుస్సు – సేవకా సిబ్బంది వలన సహ ఉద్యోగుల వలన చెప్పుకోదగిన స్థాయిలో కాకపోయినా ఇబ్బందులు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దీక్షలను నిర్వహిస్తారు.
మకరం – గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా పరిణమిస్తాయి. పాత బాకీలను తీరుస్తారు. ముఖ్యమైన సందర్భాలలో మీదే పై చేయిగా ఉంటుంది.
కుంభం – సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లైసెన్సులు, లీజులు లాభిస్తాయి. మాతృ వర్గీయ బంధువులకు మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు.
మీనం – ఎంతగానో శ్రమించి అంతంత మాత్రపు ఫలితాలని సాధిస్తారు. బ్యాంకు రుణాలు కలిసి వస్తాయి. ఆస్తుల పరిరక్షణ కష్టంగా పరిణమిస్తుంది.
Guruvaram rasi phalalu telugu
Guruvaram rasi phalalu telugu