Thursday, April 25, 2024

కంటి వెలుగు పేదప్రజలకు ఒక వరం: గుత్తా సుఖేందర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీ లాంజ్‌లో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి

హైదరాబాద్ : కంటి వెలుగు పథకం పేద ప్రజలకు ఒక వరం లాంటిదని రాష్ట్ర శాససమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర శాసనసభ భవనంలోని లాంజ్‌లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తాఆయన మాట్లాడుతూ, కంటివెలుగు పథకం దేశంలోనే ఒక గొప్ప కార్యక్రమం అని అన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోందన్నారు.

ప్రజలు పెద్దఎత్తున దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా మన కంటి వెలుగు పథకాన్ని ఆయా రాష్ట్రాలలో అమలు చేయాలని ఆలోచిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని శాసనసభ్యులు, శాససమండలి సభ్యులు కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, వైద్య,ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహా చార్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అధికారులు, అసెంబ్లీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News