Friday, May 3, 2024

కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే: మోడీ

- Advertisement -
- Advertisement -

ప్రజల సంపద ఒక వర్గానికే పంపిణీ
ప్రధాని మోడీ ఆరోపణాస్త్రాలు

జైపూర్: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మరోసారి కాంగ్రెస్‌పై ఆరోపణాస్త్రాలు కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మత విశ్వాసాలను కొనసాగించడం కష్టమని అంటూ ప్రజల సంపదను లాక్కుని ఒక వర్గానికి పంపిణీ చేయాలని ఆ పార్టీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. చేశారు. కాంగ్రెస్ పాటనలో మత విశ్వాసాలను పాటించడం కూడా ప్రజలకు కష్టంగా మారుతుందని మంగళవారం రాజస్థాన్‌లోని టోంక్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఆయన ఆరోపించారు.

కాగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమవుతుందని ఆయన ఆరోపించారు. దేశం హనుమాన్ జయంతి జరుపుకుంటున్న రోజున మోడీ నుంచి ఈ ఆరోపణలు రావడం గమనార్హం. రాజస్థాన్‌లోని బన్సారాలో ఒక ఎన్నికల ప్రచార సభలో తాను ప్రసంగిస్తూ ప్రజల సంపదను పంపిణీ చేయడంపై చేసిన వ్యాఖ్యలను మోడీ ప్రస్తావిస్తూ తన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్ర ఆగ్రహం చెంది ప్రతి చోట తనను దూషించడం ప్రారంభించాయని చెప్పారు. మీ సంపదను లాక్కుని ఒక ఎఒపిక చేసిన కొందరు వ్యక్తులకు పంపిణీ చేయాలన్న లోతైన కుట్రను కాంగ్రెస్ రచిస్తోందన్న వాస్తవాన్ని మాత్రమే తాను బయటపెట్టానని మోడీ తెలిపారు.

రెండు మూడు రోజుల క్రితం తాను కాంగ్రెస్ పార్టీ చేసే ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాల గురించి మాట్లాడానని, ఇది కాంగ్రెస్‌కు, ఇండియా కూటమికి ఆగ్రహం తెప్పించి మోడీని తిట్టడం ప్రారంభించాయని ఆయన తెలిపారు. నిజం మాట్లాడితే కాంగ్రెస్ ఎందుకు భయపడి తన విధానాలను దాచిపెడుతోందని ఆయన ప్రశ్నించారు. దేశంలోని ప్రజల వద్ద ఉన్న సంపదపై సర్వే జరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రాసిందని, సంపదపై ఎక్స్‌రే తీస్తామని ఆ పార్టీ నాయకుడే ప్రకటించాడని మోడీ తెలిపారు. మీ రహస్యాలు బట్టబయలు కావడంతో మీ రహస్య ఎజెండా బయటపడి వణుకుతున్నారని ఆయన కాంగ్రెస్‌ను ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News