Thursday, May 2, 2024

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి

- Advertisement -
- Advertisement -

మెదక్ మున్సిపాలిటీ: ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ సిద్ధాంత కర్త, జయశంకర్ వర్ధంతి పురస్కరించుకొని మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ రమేష్, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టాలను, కష్టాలను.. తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ఆశించినట్లే స్వరాష్ట్ర పాలనలో, సకల జనుల సంక్షేమానికి పాటు పడుతూ దేశానికే తలమానికంగా ఆదర్శంగా నేడు తెలంగాణ నిలిచింది.

తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ధ్యాసగా మీరు నడిపిన పోరాటం, జీవితం మహోన్నతమైనది. మీరు కలలుగన్న తెలంగాణ ప్రగతి సాక్షిగా మీకివే మా నివాళులు అని అన్నారు.తెలంగాణ ప్రాంతం ఆంధ్ర పాలకుల వల్ల అణగారిపోయి అభివృద్ధికి నోచుకోకుండా ఉందని వారి నుండి విముక్తి కోసం తెలంగాణ ఉద్యమ కర్త కెసిఆర్‌తో వెన్నంటి ఉండి తెలంగాణ ప్రాంతంలో మన నీళ్లు,మన నిధులు,మన ఉద్యోగాలు కావాలని, కోరుకునే వ్యక్తులలో మొదటి వ్యక్తి జయశంకర్ అని అన్నారు. ఆశయాలను బంగారు తెలంగాణ కోసం నిత్యం తపించే గొప్ప ఆదర్శవాది అని అన్నారు. వారి అకాల మరణం తెలంగాణ ప్రాంత ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, మున్సిపల్ కౌన్సిలర్ జయరాజ్,నిజాంపేట్, ఎంపిపి సిద్దిరాములు, నిజాంపేట్,శంకరంపేట్ ఆర్, పాపన్నపేట మండలం పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పట్లోరి.రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, చెల్మెడ. ఎంపిటిసి బాల్‌రెడ్డి, నాయకులు రాగి.అశోక్, లింగారెడ్డి, వెంకటేశం, గంజి. నవీన్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News