Tuesday, September 10, 2024

ప్రేమ పేరుతో వేధింపులు

- Advertisement -
- Advertisement -

కుషాయిగూడకు చెందిన యువతి ఉద్యోగం చేస్తున సమయంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో ఇద్దరు కలిసి ఫొటొలు తీసుకున్నారు. తర్వాత యువకుడి ప్రవర్తన నచ్చకపోవడంతో అతడిని దూరం పెట్టింది. దీంతో యువతిపై కక్ష పెంచుకున్న యువకుడు తన వద్ద ఫొటోలు ఉన్నాయని, తను చెప్పిన ప్రదేశానికి రావాలని లేదంటే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తానని బెదిరించాడు.

యువతి అతడు చెప్పిన చోటికి వెళ్లకపోవడంతో బోనాల పండుగ రోజు తను ఉంటున్న హాస్టల్ వద్ద నిలబడి బోనాల పండుగ ఊరేగింపు చేస్తుండగా వచ్చిన నిందితుడు అక్కడికి వచ్చి కొట్టాడు. అంతేకాకుండా ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను ఆమె స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పోస్ట్ చేశాడు. దీంతో బాధితులు షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన కుషాయిగూడ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News