సెప్టెంబర్ 9వ తేదీ నంచి ఆసియా కప్-2025 ప్రారంభంకానుంది. ఈసారి ఈ టోర్నమెంట్‌కి భారత్ ఆతిధ్యం ఇవ్వనున్నా.. పాకిస్థాన్‌తో ఒప్పందం ఉండటంతో యుఎఇలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. అయితే ఇప్పటికే సెలక్టర్లు జట్టులో ఎవరిని ఎంపిక చేయాలా…? అని కసరత్తు ప్రారంభించారు.. ఈ నేపథ్యంలో టీం ఇండియాకు ఎవరిని ఎంపిక చేయాలా అనే విషయంలో మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh).. సెలక్టర్లకు సలహా ఇచ్చారు. టెస్ట్ కెప్టెన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు రియాన్ పరాగ్‌కి చోటు కల్పించాలని భజ్జీ పేర్కొన్నారు
‘‘టి-20 క్రికెట్ అంటే కేవలం బాదుడు మాత్రమే కాదు.. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాలి. అందుకే గిల్‌ని ఎంపిక చేశాను. అతను అవసరమైతే బంతిని మైదానంలో లేకుంటే ప్రశాంతంగా బ్యాటింగ్ చేస్తాడు. ఐపిఎల్ ప్రతీ సిజన్‌లో సీజన్‌లో మంచి బ్యాటింగ్ చేశాడు. 120 స్ట్రైక్‌రేటుతోనే కాకుండా అవసరమైతే 160తో కూడా పరుగులు రాబట్టాడు. అందుకే గిల్‌ను టి-20 జట్టులో చోటు ఇవ్వాలి. ఇక కెఎల్ రాహుల్ మంచి ఆటగాడు.. కానీ, అతన్ని తీసుకోలేదు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కి ఛాన్స్ ఇస్తా. అతను లేకుంటే రాహుల్ని తీసుకుంటా’’ అని హర్భజన్ (Harbhajan Singh) వెల్లడించారు.