Tuesday, September 16, 2025

కాంగ్రెస్ పార్టీకి హార్దిక్ పటేల్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

Hardik Patel resigns from Congress

అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీకి భారీ జలక్ తగిలింది. హార్దిక్ పటేల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గుజరాత్ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాట కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్న విషయం తన ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించారు. గుజరాతీ ప్రజలు తన నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తాను వేయబోయే అడుగు భవిష్యత్తులో గుజరాతీలకు పాజిటివ్‌గా పనిచేస్తుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ట్విటర్ ద్వారా షేర్ చేశారు. పట్టేదార్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పటేల్ 2019 లో కాంగ్రెస్‌లో చేరారు. గుజరాత్ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు అధికంగా ఉన్నట్టు చాన్నాళ్ల నుంచి హార్దిక్ ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News