Sunday, May 12, 2024

వీసాలకు లంచం కేసు.. కార్తి చిదంబరం సన్నిహితుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

CBI Arrests Close Aide of Karti Chidambaram

న్యూఢిల్లీ : చైనా జాతీయుల వీసాలకు అనుమతులు మంజూరు చేసే విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కార్తీకి అత్యంత సన్నిహితుడైన ఎస్. భాస్కరరామన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం అరెస్టు చేసింది. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని కార్తీ నివాసం, కార్యాలయాల్లో సీబీఐ మంగళవారం సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం భాస్కర రామన్‌ను ప్రశ్నించిన అధికారులు ఈ ఉదయం అరెస్టు చేసినట్టు తెలిపారు. పంజాబ్ లోని ఓ పవర్ కంపెనీ పనుల నిమిత్తం చైనా నుంచి వచ్చిన 263 మందికి వీసాలను జారీ చేసేందుకు గాను కార్తీ రూ. 50 లక్షలు తీసుకున్నట్టు సీబీఐ తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. 2011 లో యూపీఎ ప్రభుత్వ హయాంలో కార్తీ తండ్రి పి. చిదంబరం కేంద్ర హాం మంత్రిగా ఉన్నప్పుడు ఈ వ్యవహారం చోటు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. పంజాబ్ లోని తలవండీ పవర్ ప్రాజెక్టు ప్రతినిధి వికాస్ మఖరియా, తమ ప్రాజెక్టు పనుల్లో జాప్యం అవుతున్నందున చట్టపరమైన చర్యలను తప్పించుకునేందుకు చైనా నుంచి అదనపు సిబ్బందిని, నిపుణులను ఆ వీసాల సాయంతో రప్పించినట్టు సీబీఐ తెలిపింది.ఇందుకు గాను ముఖరియా …. కార్తి సన్నిహితుడైన భాస్కర్‌ను సంప్రదించగా అతడి ద్వారా ఈ వీసాలకు అనుమతులు పొందినట్టు పేర్కొంది. ఈ వీసా అనుమతుల కోసం కార్టీ రూ. 50 లక్షలు తీసుకున్నారని తెలిపింది. పని పూర్తయిన తరువాత మఖరియా ఈమెయిల్ ద్వారా కార్టీ , భాస్కర్ రామన్‌కు కృతజ్ఞతలు కూడా తెలిపారని ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News