Saturday, July 27, 2024

కమలానికి కర్రు కాల్చి వాత పెడదాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / పటాన్‌చెరు /తాండూర్/ కామారెడ్డి ప్రతినిధి: ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు సంక్షేమం, అభివృద్ధి ప్రాతిపదికన జరగడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు శనివారం సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు, వికారాబాద్ జిల్లా, తాండూర్, కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. పటాన్‌చెరులో అంబేద్కర్ విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. మతాల మధ్య, మనుషుల మధ్య చిచ్చుపెట్టేందుకు ఎన్నికలు జరుగుతున్నాయని అ న్నారు. పటాన్‌చెరు ప్రాంతం ఓ మినీ ఇండియా అన్నారు. ఇక్కడ అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, మతాల వారు జీ వనం సాగిస్తున్నారని చెప్పారు. అందరి సంక్షేమం కోసం పాటు పడే వ్యక్తి తమ పార్టీ ఎంపి అభ్యర్థి నీలం మధు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాను అభివృద్ధి చేసే బా ధ్యత తనదేన్నారు. ఈ సభలో మంత్రులు కొండా సురేఖ, దామోదర్ రాజనర్సింహ, టిఎస్‌ఐఐసి చైర్మన్ నిర్మల, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపి అభ్యర్థి నీలం మధు ముదిరాజ్,

నియోజకవర్గ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా, తాం డూరు విల్యామూన్ హైస్కూల్ మైదానంలో పార్లమెట్ ఎన్నికల బహిరంగ సభలో సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు భరోసా ద్వారా రూ.7500 కోట్లు నిధులు ఈనెల 6న రైతుల ఖాతాలో వేశామని అన్నారు. కెసిఆర్ సవాల్ చేశారు కదా.. ఏమైనా సోయి ఉంటే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాస్తావా అని డిమాండ్ చేశారు. పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల రుణం తీర్చుకొని వారిని ఆదుకునే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో తమ పార్టీ తీసుకుంటుందని అన్నారు. ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, సోనియాగాంధీ ఇచ్చినవేనని అ న్నారు. బిజెపి పాలనలో తెలంగాణకు ఏమి ఇచ్చిందంటే గాడిద గుడ్డేనని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి కర్రుకాల్చి వాత పెడదామని అన్నారు. చేవెళ్ల అభ్యర్థి రంజిత్‌రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు.

మోడీ భ్రమలో పడితే రాజ్యాంగాన్ని మార్చుకున్న వారమవుతామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు సూచించారు. కామారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ తమకు 400 సీట్లు కావాలని మోడీ పదేపదే అడగడం వెనుక రాజ్యాంగం మార్పు కుట్ర జరుగుతోందని స్పష్టం చేశారు. బిజెపి జాతీయ నాయకులు సైతం ఇదే విషయాన్ని అనేకసార్లు చెప్పుకొచ్చారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో సెమీఫైనల్ ఎన్నికల్లో కెసిఆర్‌ను ఇంటికి పంపిన ప్రజలు ఫైనల్‌లో మోడీని ఓడించాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కూటమికి అనుకూల వాతావరణం ఉందని, కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ పాలిత ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News