Saturday, May 3, 2025

కాంగ్రెస్ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణను బిజెపి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలోని న్యాల్‌కల్‌ మండలం రత్నాపూర్‌ గ్రామానికి చెందిన బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హరీశ్‌రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి హరీష్ రావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. జహీరాబాద్ నియోజక వర్గానికి అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని ధ్వజమెత్తారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందని హరీష్ రావు దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News