హైదరాబాద్: ఉపాధిహామీ కూలీల వేతనాలు 4 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఉపాధిహామీ పనిదినాలు 2024- 2025సంవత్సరానికి 12.22 కోట్ల నుంచి 6.5 కోట్లకు తగ్గాయని అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42 సార్లు ఢిల్లీ వెళ్లినా ఉపాధి పనిదినాలు సగం తగ్గాయని ఎద్దేవా చేశారు. విషయం తెలిసినా కాంగ్రెస్, బిజెపి ఎంపిలు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. వెంటనే ఉపాధి కూలీల పనిదినాలు పెంచాలని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు మంజూరైన సరేనా పనిదినాలను కేంద్రం సగానికి తగ్గించడం శోచనీయమని హరీష్ రావు అన్నారు. రేవంత్ 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టి సాధించేదేమీ లేదని, కాంగ్రెస్, బిజెపికి చెరో 8 మంది ఎంపిలు ఉన్నా, ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్నినాశనం చేయాలని చూస్తున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.
వెంటనే ఉపాధి కూలీల పనిదినాలు పెంచాలి: హరీష్ రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -