Monday, March 17, 2025

సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ప్రారంభిస్తారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సన్ ఫ్లవర్ రైతుల కష్టాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టవా?అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సిఎంకు  హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ప్రారంభిస్తారని డిమాండ్ చేశారు. దళారులకు తక్కువ ధరకే విక్రయించాల్సిన దుస్థితి రైతులకు తెచ్చారని మండిపడ్డారు. క్వింటాళ్లకు రూ. వెయ్యికి పైగానే నష్టాన్ని రైతులకు కలిగిస్తున్నారని బాధను వ్యక్తం చేశారు. మా పాలనలో నూనె పంటలకు ప్రోత్సాహం… మీ పాలనలో తిరోగమనం అని విమర్శించారు. ఎన్నికల కోడ్ తో సంబంధం లేకుండా సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు తెరవాలని హరీష్ రావు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News