Thursday, July 18, 2024

ప్రజావాణిలో పురుగుల మందు తాగిన రైతు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిన్న ఖమ్మం జిల్లాలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే, బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా ప్రజావాణిలో తన సమస్యను పట్టించుకోవడం లేదని పురుగుల మందు తాగి మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమైన విషయమని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు మండిపడ్డారు. హరీష్ రావు తన ట్వీట్టర్ లో ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరగటం నిత్యకృత్యం అవుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి తగిన చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లా ఐజా మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన పరశురాముడు అనే రైతు 5 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేశారు. దీనిపై అధికారుల దగ్గరికి వెళ్లిన పట్టించుకోవడం లేదని, ప్రజావాణిలో తన సమస్య పరిష్కారం అవ్వడం లేదని కలెక్టర్ ఛాంబర్లో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News