Sunday, May 5, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్త మత్స్య పారిశ్రామిక సోసైటీలు

- Advertisement -
- Advertisement -

Harish Rao Meeting with Fishery Officer

సిద్దిపేట: ఎన్నో ఎళ్ల నుంచి కొత్త మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలని, నూతన సభ్యత్వాలు ఇవ్వాలని మత్స్య కార్మికుల నుంచి డిమాండ్ ఉందని కాని ఏ ప్రభుత్వం వారి డిమాండ్ పట్టించుకోలేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం ఫిషరీస్ అధికారులతో ఎమ్ సిఆర్ హెచ్ఆర్ డిలో జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. ”ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే మత్స్య కార్మికుల సమస్యలు, డిమాండ్లపై స్పందించారు. ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలు ఇస్తోన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి వనరులు పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, ఇతర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో నీట వనరులు గణనీయంగా పెరిగాయి. ప్రతీ చెరువు కాళేశ్వరం నీటితో కళకళలాడుతోంది. చెక్ డ్యాంలు పెద్ద ఎత్తున జిల్లాలో నిర్మించాం. దీని వల్ల నీటి వనరులు పెరిగాయి. వీటిలో చేపల పెంపకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. కొత్తగా పెరిగిన నీటి వనరుల వల్ల ఆయా గ్రామాల్లో చేపల పెంపకం చేపట్టవచ్చు. ఇలాంటి నీటి వనరులు ఉన్న చోట కొత్త మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నీటి వనరులు లేనప్పుడు రెండున్నర ఎకరాలకు ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయడం జరిగింది. కాని ఇప్పుడు నీటి వనరులు పెరగడంతో ఎకరం నీటి వనరుకు ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన కొత్తగా సొసైటీలు ఏర్పాటు ఏర్పాటు చేయడంతో పాటు, పాత సోసైటీల్లోను ఎకరానికి ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాల్సి ఉంది. దీని వల్ల పాత సొసైటీల్లోను కొత్తగా సభ్యులను ఎంపిక చేయవచ్చు. సిద్దిపేట జిల్లాలో 281 సోసైటీలు ఉండగా అందులో 20731 మందికి సభ్యత్వం ఉంది. ప్రస్తుతం ఈ సొసైటీలు జిల్లాలోని 1255 నీటివనరులను వినియోగించుకుంటున్నాయి. ఇంకా 381 నీటి వనరులకు సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మెదక్ జిల్లాలో 263 సొసైటీల్లో 15724 మంది సభ్యులు ఉన్నారు. ఈ సొసైటీలు జిల్లాలోని 1379 నీటి వనరులను వినియోగించుకుంటున్నాయి. ఇంకా 235 నీటి వనరులకు కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది.  సంగారెడ్డి జిల్లాలో 193 సొసైటీల్లో 10434 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘాలు 875 నీటి వనరులను వినియోగించుకుంటున్నాయి. ఇంకా 196 నీటి వనరులకు సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మండల వారీగా, నియోజకవర్గాల వారీగా నీటి వనరులు ఎలా ఉన్నాయో ఫిషరీస్ శాఖ లెక్క తెల్చాలని ఆదేశిస్తున్నాఏ చెరువు వర్షం మీద ఆదారపడి ఉంది, ఏ చెరువుకు కాలువల నీరు చేరుతుందన్న సమాచారం సేకరించాలి. ఏ సోసైటీ లో ఎందరు సభ్యులు ఉన్నారు. కొత్తగా ఎంత మంది చేర్చుకోవచ్చు అన్న సమాచారం పక్కాగా సేకరించాలి. కొత్త సభ్యత్వం చేపట్టడం, కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయడం వల్ల మత్స్య కార్మికులకు ఉపయోగాలున్నాయి.సొసైటీలో సభ్యులు ఎక్కువ మంది ఉంటే బీమా సౌకర్యం కలుగుతుంది. రుణ సౌకర్యం సుళువుగా జరుగుతుంది. ప్రభుత్వ సబ్సిడీ పథకాలు అందరికీ వర్తిస్తాయి” అని పేర్కొన్నారు.

Harish Rao Meeting with Fishery Officer

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News