Monday, June 24, 2024

తెలంగాణ దేశానికి దిక్సూచి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: సిఎం కెసిఆర్ తెలంగాణను దేశానికి దిక్సూచిగా మార్చారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటిస్తున్నారు. సంగారెడ్డిలోని కొండకల్‌లో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. పటాన్‌చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ అచరిస్తుందని, దేశం అనసరిస్తుందని చెప్పారు.

Also Read: దశాబ్ది దగానే: రేవంత్ రెడ్డి

అత్యవసర పరిస్థితుల్లో గాంధీకో, ఉస్మానియాకో వెళ్లాల్సిన అవసరం లేదని, పటాన్‌చెరు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి గొప్ప వరమన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన నేత సిఎం కెసిఆర్ ప్రశంసించారు. కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలకు వారానికి రెండు రోజుల పవన్ హాలీడేలు ఉండేవన్నారు. తాము 24 గంటల నిరంతర కరెంట్ సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి కావాలో తెలిసిన నాయకుడు సిఎం కెసిఆర్ అని ప్రశంసించారు. సింగూరు జలాలను సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఇచ్చిన నాయకుడు కెసిఆర్ అని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News