Friday, July 19, 2024

ఒయులో జర్నలిస్టులు అరెస్టు… మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే: హరీష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. బుధవారం హరీష్ రావు తన ట్విట్టర్ ట్వీట్ చేశారు. డిఎస్ సి అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే జర్నలిస్టులు  చేసిన తప్పా? అని ప్రశ్నించారు. జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే అని హరీష్ రావు మండిపడ్డారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News