Saturday, October 5, 2024

ఎనుముల కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ రెడ్డిది అంతా మోసం, అన్ని అబద్ధాలేనని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను, రుణమాఫీని చేపట్టాలని సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో గద్దెనెక్కడానికి రేవంత్ రెడ్డి అనేక అబద్ధపు హామీలను ఇచ్చారని ఈయన అసలైన ఇంటి పేరు ఎనముల కాదని ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నారు. కెసిఆర్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామన్నారు. కరోనా లాంటి కష్ట కాలంలో సైతం మంత్రులకు, ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వకుండా రైతులకు ఆనాటి సీఎం కేసీఆర్ రైతుబంధు డబ్బులను అకౌంట్లో జమ చేశారని గుర్తు చేశారు. రైతులపై కేసీఆర్ కు ఎంతో ప్రేమ ఉందన్నారు. రైతుల విలువలను పెంచింది కేసీఆరేనని అన్నారు. అదే రేవంత్ రెడ్డి రైతుల విలువలను తగ్గిస్తున్నారని మండిపడ్డారు.

బిఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో రైతులకు ఇబ్బందులు రాకుండా నిరంతరం నాణ్యమైన ఉచిత విద్యుత్‌తోపాటు ఎరువులు, విత్తనాలు, రైతుబంధును అందించామన్నారు. అలాగే రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో అన్ని కోతలు, వాతలు ఉండేవనని యూరియా కోసం లైన్లలో నిలబడి పోలీస్ స్టేషన్ల వద్ద తీసుకునే పరిస్థితి ఉండేదన్నారు. అదే కేసీఆర్ సీఎం అయ్యాక గ్రామాల్లోకి యూరియా, విత్తనాలు పంపించి అందించామన్నారు. మళ్లీ కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దర్శనమిస్తున్నాయన్నారు. రైతులు రెండు పంటలు పండించాలన్న పట్టుదలతో కెసిఆర్ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణలను పూర్తి చేయించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 భాగాలు ఉంటాయని ఇందులో ఒక భాగంలోని రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని దీన్ని రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెసొళ్ళు వాడుకుంటున్నారన్నారు. కాళేశ్వరం కుంగిపోయి ఉంటే మల్లన్న సాగర్, రంగనాయక సాగర్,

కొండ పోచమ్మ సాగర్‌లో గోదావరి జలాలతో నిండు కుండలా ఎలా ఉంటాయి, యాసంగి పంటకు నీళ్లు ఎలా వస్తాయి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు, రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారన్నారు. 100శాతం రుణమాఫీ పూర్తి చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నానన్నారు. హరీష్ రావు ఎక్కడ నిద్రపోతున్నాడని రేవంత్ రెడ్డి అడిగాడని కానీ తాను మాత్రం రేవంత్ రెడ్డి గుండెల్లోనే నిద్రపోతున్నానని జవాబు ఇచ్చానన్నారు. తాను వెనుక పడడంతోనే రేవంత్‌రెడ్డి సగం మందికి రుణమాఫీ చేశారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News