Thursday, April 25, 2024

హర్యానా క్రీడాశాఖ మంత్రి సందీప్ సింగ్‌పై లైంగిక వేధింపు కేసు!

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: ఓ మహిళా కోచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపు ఆరోపణలను హర్యానా క్రీడాశాఖ మంత్రి సందీప్ సింగ్‌పై పెట్టినట్లు పోలీసులు తెలిపారు. బిజెపి నాయకుడు, భారత మాజీ హాకీ టీమ్ కెప్టెన్ అయిన అతడిపై శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. “హర్యానా మహిళా కోచ్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు హర్యానా క్రీడాశాఖ మంత్రి డిసెంబర్ 31న ఐపిసి సెక్షన్లు 354,354ఎ, 354బి, 342, 506 కింద చండీగఢ్ సెక్టార్ 26 పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టరు చేశాము” అని పోలీస్ ప్రతినిధి తెలిపారు.

రాష్ట్రానికి చెందిన ఓ జూనియర్ అథ్లెట్ కోచ్ గురువారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనను మంత్రి లైంగికంగా వేధిస్తున్నాడని కేసు దాఖలు చేసింది. చండీగఢ్‌లోని తన రెసిడెన్స్‌కమ్‌క్యాంప్ ఆఫీస్‌లో తనని లైంగికంగా వేధించాడని ఆ మహిళా కోచ్ సందీప్ సింగ్‌పై ఆరోపణలు చేసింది. కాగా ఆ ఆరోపణలను మంత్రి నిరాధారం అంటూ కొట్టిపారేశారు. పైగా స్వతంత్ర దర్యాప్తు చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News