Saturday, July 5, 2025

మరోసారి షమీపై హసీన్ ఆరోపణలు.. కుటుంబాన్ని నాశనం చేశావంటూ..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: టీం ఇండియా పేసర్ మహ్మద్ షమీపై (Mohammed Shami) అతని మాజీ భార్య హసీన్ మరోసారి వార్తల్లో నిలిచారు. కొన్నేళ్ల క్రితం షమీ తనను గృహహింసకు గురి చేశాడని.. హసీన్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరి విడాకుల గురించి కోల్‌కతా న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో షమీపై ఆరోపణలు చేస్తూ.. హసీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. షమీది క్యారెక్టర్ లేనితనమని, దురాశ, క్రూరమైన మనస్తత్వంతో సొంత కుటుంబాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడని ఆమె పేర్కొన్నారు. క్రిమినల్స్‌కి డబ్బు ఇచ్చి తనను హత్య చేసేందుకు ప్రయత్నించాడని.. తన పరువు తీసేందుకు, ఓడించేందుకు యత్నించి విఫలమయ్యాడని ఆమె అన్నారు. దాని వల్ల ఏం సాధించావు? అని ప్రశ్నించారు.

‘‘క్రిమినల్స్, వేశ్యలకు ఇచ్చిన డబ్బు మన కుమార్తె చదువు కోసం, మన భవిష్యత్తు కోసం ఉపయోగించి ఉంటే.. మన కుటుంబం ఉంతో సంతోషంగా ఉండేది. ఎంతో మర్యాదగా మనం జీవించే వాళ్లం. నాకు భగవంతుడు ఎంతో సహనం ఇచ్చాడు. అందుకే ఏళ్ల తరబడి న్యాయం కోసం పోరాడుతున్నాను.. ఉంటాను కూడా. నువ్వు ఎంత మంది క్రిమినల్స్‌తో చేతులు కలిపినా.. నన్ను ఏం చేయలేకపోయావు. నాపై నిందులు వేసి మద్దతు సంపాదించుకోగలవు.. కానీ, ఏదో ఒక రోజు నీకు కష్టకాలం వస్తుంది. నీకు అండగా నిలిచిన వాళ్లే నిన్ను తరలిమేస్తారు. చట్టంపై నాకు నమ్మకం ఉంది’’ అంటూ హసీన్ రాసుకొచ్చారు.

2014లో షమీతో (Mohammed Shami) హసీన్‌కి వివాహం జరగగా.. వాళ్లకి ఓ పాప జన్మించింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చి విడిగా ఉంటున్నారు. 2018లో హసీన్ షమీపై ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో తాజాగా హసీన్, ఆమె కుమార్తె సంరక్షణ కోసం రూ.4 లక్షలు భరణంగా ఇవ్వాలని.. షమీని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News