Friday, March 31, 2023

జడ్చర్ల పాఠశాలలో కలెక్టర్ తనిఖీ… హెడ్ మాస్టర్ సస్పెండ్

- Advertisement -

మహబూబ్ నగర్: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు తనిఖీ చేశారు. పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీలక్ష్మి ప్రార్ధనకు హాజరుకాకపోవడంతో ఆమెను సస్పెండ్ చేశారు.
మరో టీచర్ శారద ఆలస్యంగా రావడంతో ఆమె మెమో జారీ చేశారు. జిల్లా కలెక్టర్ సోమవారం ఉదయం 8.35 కే పాఠశాలలో తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ పాఠశాల ప్రార్ధన లో పాల్గొనడంతో పాటు విద్యార్థులతో ముఖాముఖిగా సంభాషించారు. ఎఫ్ ఎల్ ఎన్, మన ఊరు-మన బడి పనుల పరిశీలించడంతో పాటు ఇంజనీర్లకు సూచనలు చేశారు. పాఠశాలలో జిల్లా కలెక్టర్
9.45 గంటల వరకు వేచి చూసిన కూడా హెడ్ మాస్టర్ రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News