Thursday, November 30, 2023

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నగరంలో మరోసారి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు తదితర హెచ్చరికలు జారీ చేసిన శాఖ.. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.

ఐఎమ్ డి ప్రకారం, హైదరాబాద్‌లోని మొత్తం ఆరు జోన్‌లు – చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి లలో సెప్టెంబర్ 28 వరకు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్ డిపిఎస్) డేటా ప్రకారం, నిన్న నగరంలో సాయంత్రం వర్షం కురిసింది. బండ్లగూడలో అత్యధికంగా 12 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో తెలంగాణలో సాధారణ వర్షపాతం 717.3 మిల్లీమీటర్లు దాటి 840.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 589.5 మిమీ కంటే 724.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం కూడా నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News