- Advertisement -
తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. నల్గొండ, మెదక్, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుసే చాన్స్ ఉందని చెప్పింది. ఇక, హైదరాబాద్, రంగారెడ్డి, కరీనంగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వానలు పడతాయన అంచనా వేసింది. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
- Advertisement -