Monday, April 29, 2024

తెలంగాణలో రానున్న మూడురోజుల్లో భారీ వర్షాలు..

- Advertisement -
- Advertisement -

Telangana to witness rainfall over next three days

రెండు, మూడురోజుల్లో రాష్ట్రంలోకి ‘నైరుతి’ పూర్తిగా ప్రవేశం
11వ తేదీ తరువాత తెలంగాణలో పలుచోట్ల భారీగా వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రెండు, మూడురోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలున్నాయని, ఈ నెల 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో మూడురోజుల పాటు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ సంచాలకులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు, ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం మరఠ్వాడ నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు ఉన్న ద్రోణి మంగళవారం బలహీనపడిందని, కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి వస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Heavy Rains in Telangana for next 3 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News