Wednesday, May 8, 2024

గ్యాంగ్ వార్‌లో గాయపడిన అద్నాన్ మృతి

- Advertisement -
- Advertisement -

Adnan wounded in gang war died

 

మనతెలంగాణ, హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీ డబీర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన స్ట్రీట్ ఫైట్‌లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మంగళవారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. డబీర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న వివాదం పెద్దది కావడంతో యువకులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. అజీబ్, ముజీబ్, కమ్రాన్ గ్యాంగ్, అద్నాన్ గ్యాంగ్‌పై దాడి చేశారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్న సంఘటనలో అద్నాన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటే ఆస్పత్రికి తరలించగా చిక్సిత పొందుతూ మృతిచెందాడు. ఈ కేసులో వెంటనే యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డబీర్‌పుర పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News