Monday, April 29, 2024

రాజకీయంగా విడిపోయినా మా మధ్య బంధం తెగిపోలేదు

- Advertisement -
- Advertisement -

Uddhav Thackeray meets PM Modi

మోడీతో భేటీపై థాకరే వ్యాఖ్యలు

న్యూఢిలీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మంగళవానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమై ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసిన మరాఠా రిజర్వేషన్ కోటాను గురించి చర్చించారు. ప్రధాని మోడీతో 10 నిమిషాలు ముఖాముఖీ చర్చలు జరిపిన థాకరే ఇటీవల మహారాష్ట్రను దెబ్బతీసిన తౌక్టే తుపాను సహాయం గురించి కూడా చర్చించినట్లు తెలిసింది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఇతర అధికారులతో కలసి తొలుత ప్రధానితో సమావేశమైన థాకరే అనంతరం విడిగా ఒక్కరే ప్రధానితో చర్చలు జరిపారు.

ప్రధానితో ఏకాంత చర్చలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు థాకరే సమాధానమిస్తూ రాజకీయంగా తాము కలసి ఉండనప్పటికీ తమ మధ్య సంబంధాలు తెగిపోలేదని వ్యాఖ్యానించారు. తాను నవాజ్ షరీఫ్‌ను(పాక్ మాజీ ప్రధాని) కలవడానికి వెళ్లలేదని, ఏకాంతంగా ఆయనను(మోడీని) కలవడం తప్పేమీ కాదని థాకరే చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News