Thursday, April 25, 2024

నగరంలో అడుగడుగునా ట్రాఫిక్ జాం

- Advertisement -
- Advertisement -

heavy traffic jam in hyderabad today

జాతీయ సమైక్యతా సభలతో వాహనాల రద్దీ
గంటల కొద్ది రోడ్లపై ఉన్న వాహనదారులు
మెట్రో రైలును ఆశ్రయించారు

హైదరాబాద్: నగరంలో వాహనదారలు ట్రాఫిక్ జాంతో ఇబ్బందులు పడ్డారు. కిలో మీటర్ దూరం వెళ్లాలన్నా గంటల కొద్ది రోడ్లపై ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఎన్‌టిఆర్ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర మంత్రి అమిత్‌షా సభలు నిర్వహించారు. దీంతో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీని వల్ల చాలామంది వాహనదారులు తక్కువ దూరం వెళ్లాలన్నా చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. నల్గొండ చౌరస్తా నుంచి కోఠి వరకు, లక్డికపూల్ ప్రాంతంలో మొత్తం వాహనాలు ఆగిపోయి. ఎంజే మార్కెట్ ప్రాంతంలో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయి, అక్కడి నుంచి అబిడ్స్, నాంపల్లి వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట, సికింద్రాబాద్ నుంచి అన్ని ప్రాంతాల వైపు మొత్తం వాహనాలు ఆగిపోయాయి. బంజారాహిల్స్‌లో బంజారా భవన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించడంతో ఆ ప్రాంతంలో మొత్తం వాహనాలు ఆగిపోయాయి.

ఒకేసారి నగరంలో రెండు సభలు ఉండడంతో జిల్లాల నుంచి జనాలన తరలిం చారు. వారి కోసం ఏర్పాటు చేసిన బస్సులు వాహనాలతో నగరం నిండిపోయింది. నగరంలోని వాహనాలతోపాటు బయటికి నుంచి వచ్చిన వాహనాలతో నగరంలోని రోడ్లు కిక్కిరిసి పోయాయి. దీనికి నగరంలోని వాహనాలను తోడు కావడంతో రోడ్ల మీద రద్దీ ఎక్కువైంది, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో వాహనదారులు కొన్ని ప్రాంతాల నుంచి వెళ్లాల్సి రావడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. కిలో మీటర్ దూరం వెళ్లాల్సి ఉన్నా గంటల తరబడి రోడ్లపై వేచి ఉండాల్సి వచ్చింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చాలా మంది నగరంలో ట్రాఫిక్ జాం ఏర్పడడంతో మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్రో రైలు లేని ప్రాంతాల వారు వాహనాలపై గంటల తరబడి రోడ్లపై ఉన్నారు.

విఐపిల రాకతో…
విఐపిలు నగరంలో పర్యటించడంతో పోలీసులు పలు ప్రాంతాల్లో వాహనాలను నిలిపివేశారు. వారి కాన్వాయ్‌లు ముందుకు వెళ్లే వరకు వాహనాలను ఆపడంతో మళ్లీ వాహనాలు సాధారణంగా మారే వరకు దాదాపుగా గంటకు పైగా పట్టింది. దీంతో ఒక్కప్రాంతంలో వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే మిగతా ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News