Tuesday, September 10, 2024

హెలికాప్టర్ కూలి ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

నేపాల్ రాజధాని ఖాట్మండు వాయువ్య ప్రాంతంలో పర్వతాలలో ఒక హెలికాప్టర్ బుధవారం కూలిపోగా నలుగురు చైనా పర్యాటకులు, ఒక నేపాలీ పైలట్ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రైవేట్ విమాన సంస్థ ‘ఎయిర్ డైనాస్టీ’కి చెందిన హెలికాప్టర్‌లోని పైలట్‌తో సహా ఐదుగురూ ఖాట్మండుకు వాయువ్యంగా సుమారు 30 కిలో మీటర్ల దూరంలోని నువకోట్ జిల్లాలో శివపురి నేషనల్ పార్క్‌లో పతనమైందని పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు.

హెలికాప్టర్ బుధవారం మధ్యాహ్నం 1.54 గంటలకు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిందని, టేకాఫ్ తరువాత మూడు నిమిషాలకే కంట్రోల్ టవర్‌తో సంబంధం కోల్పోయిందని నేపాల్ పౌర విమానయాన ప్రాధికార సంస్థ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ దుర్ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News