Thursday, May 8, 2025

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఆధ్యాత్మిక యాత్ర(గంగోత్రి)కు వెళుతున్న భక్తులు హెలికాప్టర్ ప్రమాదానికి గురైన దుర్ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసు కుంది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు ఎపి మహిళలు ఉండగా, గాయపడిన వ్యక్తి కూడా ఆ రాష్ట్రానికే చెందిన వారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చార్ ధామ్ యాత్ర జరుగుతున్న నేపథ్యంలో ఇది యాత్రికుల హెలికాప్టారా? కాదా? అనేది వెల్లడి కావాల్సి ఉంది. గురు వారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఘటన జరగగా ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఏడుగురు ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అధికారులతో పాటు సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరి సహాయక చర్యలు చేపట్టాయి.ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ప్రైవేట్ కంపెనీ ఏరోట్రాన్స్ సర్వీస్‌కు చెందినదిగా అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్ మారుమూల ప్రాంతంలో అడవిలో కూలిపో యింది.

ఈ ప్రమాదం జరిగిన గంగ్నాని ప్రాంతం ఉత్తరకాశీ జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి దాదాపు 50 కి.మీ దూరంలో ఉంటుంది. హెలి కాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని కళా చంద్రకాంత్ సోని (61), విజయ రెడ్డి (57), రుచి అగర్వాల్ (56), రాధా అగర్వాల్ (79), వేదవతి కుమారి(48), కెప్టెన్ రాబిన్ సింగ్‌గా అధికారులు గుర్తించారు. మృతుల్లో ముంబైకి చెందిన వారు ముగ్గు రు, ఎపికి చెందిన వారు ఇద్దరు, యూపి, గుజరాత్ లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. కెప్టెన్ రాబిన్ సింగ్ గుజరాత్‌కు చెందిన వాడిగా గుర్తించా రు. వేదవతి, విజయ ఎపి మహిళలుగా నిర్ధారించారు. గాయపడిన వ్యక్తి ఎపికి చెందిన మస్తు భాస్కర్ (51)గా తెలిపారు. వేదవతి కుమారి అనం తపురం ఎంపి లక్ష్మీనారా యణ సోదరి కాగా, ఆమె భర్తే మస్తు భాస్కర్. చార్‌ధామ్ యాత్ర పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ యాత్రను చూసేం దుకు, అలాగే పవిత్ర పుణ్య క్షేత్రాలు (యమునోత్రి, గంగోత్రి, కేధార్‌నాథ్, భద్రీనాథ్) దర్శించుకునేందుకు పర్యాటకులు వస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన యాత్రకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున ఉత్తరా ఖండ్‌కు వస్తున్నారు. ఈ యాత్రకు చాలామంది హెలీకాప్టర్‌ను ఉపయోగిస్తుం టారు. అందులో భాగంగా 7గురు యాత్రికులు ప్రైవేట్ హెలీ కాప్టర్‌లో వెళుతుండగా ఉత్తర కాశీ జిల్లా లోని గంగ్నాని సమీపంలో ఒక్కసారిగా హెలీకాఫ్టర్ కుప్పకూలిపోయింది. చార్‌ధామ్ యాత్ర ప్రారంభైన 5 రోజులకే ఈ ఘటన జర గడంతో తీవ్ర విషాదం నెలకొంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీస్ అధికారులు ప్రాథమిక నిర్ధా రణకు వచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News